ఈనెల 23నుంచి అక్కినేని నాటకోత్సవాలు

Monday, September 22nd, 2014, 12:00:04 PM IST


ప్రముఖ సినీనటుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు పేరుతొ నిర్వహిస్తున్న అక్కినేని నాటకోత్సవాలు ఈనెల 23 నుంచి విశాఖ నగరంలోని మద్దిపాలెం ఆడిటోరియంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్టు అక్కినేని కళాసాగర్ అధ్యక్షుడు తెలియజేశారు. 23, 24 మరియు 25వ తేదీలలో ఈ నాటకోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. రంగస్థల కళాకారులను, కళాసంస్థలను ప్రోత్సహించేందుకు గత పది సంవత్సరరాలుగా.. ఈ నాటకోత్సవాలను విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నాటకోత్సవాల చివరిరోజున మాజీమంత్రి ఎంవీవీఎన్ మూర్తిని అక్కినేని కళాపురస్కరారంతో సత్కరించనున్నట్టు ఆయన తెలిపారు.