అమ్మకానికి అఖిలేష్ ల్యాప్ ట్యాప్

Tuesday, October 28th, 2014, 12:16:45 PM IST


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2012లో ఆర్భాటంగా 12వ తరగతి విద్యార్ధిని విద్యార్ధులకు ల్యాప్ ట్యాప్ లను పంపిణీ చేసింది. అయితే.. అనూహ్యంగా విద్యార్ధులకు అందజేసిన ల్యాప్ ట్యాప్ లలో ఒకటి ఆన్ లైన్ లో అమ్మకానికి రావడంతో ప్రభుత్వం ఖంగు తిన్నది. వెంటనే స్పందించి.. ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది ఎవరా అని ఆరా తీసింది. వివరాలు తెలుకొని అవాక్కయింది. ఓ విద్యార్ధి తండ్రి ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ ట్యాప్ ను టీచర్ కు అమ్మాడంట. ఇప్పుడు సదరు టీచర్ ఆ ల్యాప్ ట్యాప్ ను 14వేలకు ఆన్ లైన్ లో అమ్మకానిమి పెట్టి అడ్డంగా దొరికిపోయారు.
అంతేకాకుండా.. ఆ టీచర్ “ములాయం వాలా ల్యాప్ ట్యాప్ ఔర్ సాథ్ మే నెట్ సెంటర్” అనే డిస్క్రిప్షన్ కూడా పెట్టారు. తను బీఈడి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ డబ్భులు సరిపోకే.. ల్యాప్ ట్యాప్ ను అమ్ముతున్నట్టు ఆమె పేర్కొనడం ఇక్కడ విశేషం.