ఏకంగా బాలీవుడ్ స్టార్లనే రంగంలోకి దింపిన చంద్రబాబు

Tuesday, April 12th, 2016, 06:12:03 PM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో వినూత్న వైఖరిని అవలంభిస్తున్నారు. తాజాగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రముఖ స్టార్ నటులను ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకున్నారు. ఆ స్టార్లు మన తెలుగు స్టార్లు కాదు.. బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, కాజోల్ లు. తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి ప్రముఖ స్టార్లు ఉండగా బాబు అజయ్ దేవగన్ ను ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్న మర్మం అర్థం కావడం లేదు.

ఇకపోతే ఈ విషయం పై ఈరోజు అజయ్ దేవగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బేటీ అయ్యారు. ఏపీ లో పెట్టుబడుల పట్ల తానూ ఆసక్తికరంగా ఉన్నట్లు.. అభివృద్ధి కోసం చంద్రబాబు గారు అవలంభిస్తున్న పద్దతులు నచ్చాయని అన్నారు. అలాగే విజయవాద్ కూడా హైదరాబాద్ లా అభివృద్ధి చెందుతుందని అన్నారు.