రన్ వేపై టైర్ పేలింది-అయినా ప్రమాదం తప్పింది!

Monday, June 15th, 2015, 05:55:58 PM IST


జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు పెను ప్రమాదం తప్పింది. ఇక వివరాల్లోకి వెళితే శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వేపై ఫ్లైట్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. కాగా అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనిపై స్పందించిన విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ ఫ్లైట్ లోని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని, రన్ వేను క్లియర్ చెయ్యడానికి కాస్త సమయం పడుతుందని, దీని వలన మిగిలిన విమాన రాకపోకలకు అంతరాయం కలగనున్నదని తెలిపారు. అలాగే కొన్ని విమానాలను చండీఘడ్ విమానాశ్రయానికి మళ్ళిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.