దారుణం: రన్ వే పై జారీ ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం!

Friday, August 7th, 2020, 11:08:57 PM IST


దుబాయ్ నుండి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కేరళ లోని కోజిగడ్ లో ల్యాండ్ అయ్యే ముందు రన్ వే పై జారీ ముక్కలు ముక్కలుగా అయింది. అయితే ఈ విమానం లో 191 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఒక పైలట్ తో సహా ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. విమానం లో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాల పాలు అయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

రన్ వే పై ల్యాండ్ అయ్యే సమయానికి భారీ వర్షం పడుతుంది. రన్ వే తడిగా ఉండటం కారణం చేత స్కిడ్ అయి ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఈ ఘటనను శుక్రవారం సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అయితే సహాయక చర్యలను ప్రారంభించి, దర్యాప్త చేపట్టారు. అయితే ఈ ఘటన కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై పలువురు ప్రజా ప్రతినిదులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.