ఎయిర్ ఏషియా బ్లాకు బాక్స్ లభ్యం!

Monday, January 12th, 2015, 06:01:51 PM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ వెళుతూ మార్గం మధ్యలో జావా సముద్రంలో కుప్పకూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాకు బాక్స్ లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ బ్లాక్ బాక్సును అనాలసిస్ నిమిత్తం పంపినట్లు అధికారులు తెలిపారు. ఇక ఎయిర్ ఏషియా బ్లాకు బాక్స్ లభించడంతో ప్రమాదానికి ముందు విమానంలో ఏమి జరిగింది? ప్రమాదానికి కారణం ఏమిటి? మొదలగు అంశాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా సహజంగా విమానం తోక భాగంలో ఉండే బ్లాకు బాక్స్ తన చుట్టూ 20మీటర్ల పరిధిలో జరిగిన విషయాలను రికార్డు చేస్తుంది. ఇక ఇప్పుడు దొరికిన బ్లాక్ బాక్స్ ఆధారంగా పైలెట్ల సంభాషణలు, ప్రమాదానికి దారి తీసిన పరిణామాలు తదితర అంశాలను తెలుసుకోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు.