తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు ప్రారంభం..!

Wednesday, December 9th, 2020, 03:00:09 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టును కోల్పోయింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో కనీసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీలకు పోటీ కూడా ఇవ్వకపోవడంతో ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడుని నియమించే పనిలో అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది.

అయితే ఇప్పటికే పార్టీలోని పలువురు ఆశావాహులు ఈ సారి ఖచ్చితంగా తమకే అవకాశం లభిస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ ఇంచార్జి మానిక్కం ఠాగూర్ నేడు హైదరాబాద్‌ రానున్నారు. రెండు రోజులపాటు పీసీసీ కోసం అభిప్రాయసేకరణ చేసి కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇక గురువారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశం నిర్వహించి నేతల అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీకి పంపించనున్నారు. వీటిని అధిష్టానం పరిశీలించిన తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ ఎవరన్నది ప్రకటిస్తారని సమాచారం.