వ్యవసాయం లాభసాటిగా మారాలి: పత్తిపాటి

Tuesday, February 3rd, 2015, 03:41:47 PM IST


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు విశాఖలోని నోవాటెల్ హోటల్ లో నూతన వ్యవసాయ విధానాలు – వాణిజ్యం అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది.వ్యవసాయం లాభసాటిగా మారేవిధంగా పరిశోధనలు జరగాలని పత్తిపాటి సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో రైతుబజార్లను ఆధునికించేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పత్తిపాటి తెలియజేశారు. రైతులకు ఆధినిక యంత్రపరికరాలు అందజేస్తామని పత్తిపాటి ఈ సందర్భంగా తెలియజేశారు.