వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతే దేశానికి వెన్నుముక అని ఆయన గుర్తుచేశారు. రైతు పచ్చగా ఉంటేనే.. దేశం పచ్చగా ఉంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమను కూడా అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. డ్వాక్రాగ్రూపుకు అలాగే.. పాలఉత్పత్తి దారులకు స్త్రీశక్తి పధకం ద్వారా పాడిగేదెలను అందజేస్తామని ఆయన తెలిపారు. రబీసీజన్ లో ఎరువుల కొరత లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా మత్య్సపరిశ్రమలో దళారులకు అవకాశం లేకుండా.. మత్య్సపరిశ్రమ కార్మికులే…అమ్ముకునేలాగ.. ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
ఇకపై వ్యవసాయంకూడా లాభమే
Tuesday, September 30th, 2014, 05:36:19 PM IST