హిట్టా లేక ఫట్టా : ‘అజ్ఞాతవాసి’ ట్రెండీ టాక్ !

Wednesday, January 10th, 2018, 05:45:07 PM IST

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం అజ్ఞాతవాసి. వీరిద్దరూ వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్లో వచ్చిన గత రెండు చిత్రాలు మంచి విజయం సాధించారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య టెంపో కుదిరినంతగా మరే హీరో దర్శకులకు కుదరలేదు. దీనితో అజ్ఞాతవాసి చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం నేడు విడుదలయింది. భారీ బడ్జెట్, కాస్టింగ్ తో రూపొందిన అజ్ఞాతవాసి ప్రేక్షకులని మెప్పించిందా లేదా ఇప్పుడు చూద్దాం..

పవన్ – త్రివిక్రమ్ ల చిత్రం అంటే సహజంగా పంచ్ డైలాగులు, పవన్ కళ్యాణ్ మార్క్ ఎనెర్జిటిక్ సన్నివేశాలు, కామెడీ ని ప్రేక్షకులు అంచనా వేస్తారు. అజ్ఞాతవాసి చిత్రంలో అవన్నీ మిస్సయ్యాయని చెప్పొచ్చు. త్రివిక్రమ్ చిత్రాల్లో ఎమోషనల్ సీన్స్ కూడా ప్రధాన బలంగా ఉంటాయి. ఆ విభాగంలోనూ త్రివిక్రమ్ తన మార్క్ ని కనబరచలేకపోయారు. ఇంట్రడక్షన్ సన్నివేశం, ఇంటర్వెల్ బ్యాంగ్ మినహా ఈ చిత్రంలో హై లైట్ అయిన అంశాలు లేవు. కామెడీ ఆకట్టుకోలేకపోయింది. రావు రమేష్ మాత్రమే కాస్త హాస్యం పండించడానికి ప్రయత్నించారు. యాక్షన్ సీన్స్ కొంత వరకు బావున్నాయి. ఈ చిత్రంలోని పాటలు విజువల్స్ పరంగా ఆకట్టుకుంటాయి. అభిమానుల అంచనాల సంగతి పక్కన పెడితే కనీసం త్రివిక్రమ్ శైలిలో కూడా లేని చిత్రంగా అజ్ఞాతవాసి మిగిలిపోనుంది.

అజ్ఞాతవాసి చిత్రానికి వివిధ వెబ్ సైట్లు ఇచ్చిన రేటింగ్స్ ఈ విధంగా ఉన్నాయి..

 

అజ్ఞాతవాసి – అంచనాలను అందుకోలేకపోయాడు

Reviewed By 123telugu.com |Rating : 2.75/5

ఇది అత్తారింటికి దారేది 2 కాదు.. పులి 2

Reviewed By mirchi9.com|Rating : 1.75/5

అజ్ఞాతంలోకి !

Reviewed By greatandhra.com |Rating : 2/5

అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ మార్క్ మిస్సింగ్!

Reviewed By tupaki.com|Rating : 2.25/5