మళ్లీ చిరు మీద మొదలు పెట్టేసారుగా..!

Friday, August 7th, 2020, 09:59:13 AM IST

మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఒక్క సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా వినిపిస్తునే ఉంటుంది. గత 2009 లో రాజకీయాల్లోకి వచ్చి అందులో ఇమడలేక తనకి ఎంతో పేరు తెచ్చిన సినిమాల్లోకే మళ్లీ వెళ్ళిపోయారు.

మళ్లీ ఇతర పార్టీల వైపు ఆయన చూడకపోయినా ఆయనపై జరిగే రాజకీయ ప్రచారాలు మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. ఇప్పటికే గత కొన్నాళ్ల నుంచి చిరు ఆ పార్టీలో చేరతారు ఈ పార్టీలో చేరతారు అని వార్తా వర్గాలు ఊదరగొట్టేసాయి. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలనే ప్రచారం చేస్తున్నారు.

చిరు బీజేపీలో చేరుతారని ఎప్పటి నుంచో వినపడుతున్న మాట. ఇప్పుడు తాజాగా ఏపీ కొత్త బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆయన్ని కలవడంతో మళ్లీ స్టార్ట్ చేసారు. చిరు బీజేపీలో చేరనున్నారని అందుకే ఈ మీటింగ్ అంటూ ఊదరగొడుతున్నారు. గతంలో ఏపీ సీఎం జగన్ ను కలిసినప్పుడు కూడా ఇదే రేంజ్ వార్తలను ప్రచురించారు. కానీ చిరు మాత్రం మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదని అటు వైపు వర్గాల టాక్.