అక్కడ మళ్లీ నేటి నుండి ఆరు వారాల లాక్ డౌన్!

Wednesday, July 8th, 2020, 02:03:34 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో ఆస్ట్రేలియా ప్రజలకు కాస్త ఊరట లభించింది. అయితే రెండు రోజుల నుండి మళ్లీ ఈ కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. దీంతో మళ్లీ ఆస్ట్రేలియా లో లాక్ డౌన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే అధికారులకు ఈ లాక్ డౌన్ సంబంధిత ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అయితే నేటి నుండి ఈ లాక్ డౌన్ అమలు మొదలు కానుంది.

ఇప్పటికే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది అని సంతోషం లో వుండగానే, గడిచిన 24 గంటల్లో 191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం మరొకసారి కలకలం రేపింది.అధికారులలు సైతం ఈ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిత్యావసరాలు, మందులకు, చదువు మరియు వ్యాయామం సంబంధిత పనులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా లో ఇప్పటి వరకూ 8,755 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 106 మంది ప్రాణాలను కోల్పోయారు.