తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..!

Tuesday, August 18th, 2020, 09:44:06 AM IST

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్ళీ నేడు కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1682 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,070 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,937 చేరగా, కరోనా నుంచి కోలుకుని 72,202 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 21,024 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 711కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 19,579 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 7,72,928 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 76.86 శాతంగా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.