హైదరాబాద్‌లో మళ్ళీ కంటైన్‌మెంట్ జోన్లు.. కేసుల ఆధారంగానే..!

Thursday, July 9th, 2020, 02:15:44 PM IST

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ప్రతి రోజు దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కువగా కరోనా కేసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే నమోదవుతున్నాయి. అయితే మొన్నటి వరకు హైదరాబాద్‌లో తిరిగి లాక్‌డౌన్ విధించబోతున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది.

ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తిరిగి హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తే ప్రభుత్వం మరింత నష్టపోవాల్సి వస్తుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటారని భావించి లాక్‌డౌన్ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇక లాక్‌డౌన్ విధించే అవకాశం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా జీహెచ్ఎంసీ పరిధిలో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి ఇంటిని మాత్రమే కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తుండగా, దీని ద్వారా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని. దీంతో 5 కేసుల కంటే ఎక్కువ కేసులున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.