హైదరాబాద్‌లో మరో 93 కంటైన్మెంట్ జోన్లు.. ఎక్కడెక్కడంటే?

Sunday, August 2nd, 2020, 02:19:42 AM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే హైదరాబాద్‌ మరియు గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో టెస్టుల సంఖ్య పెరిగినా కూడా కేసులు తగ్గకపోవడంతో ప్రభుత్వం మరిన్ని కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయబోతుంది.

అయితే మొత్తం 93 కంటైన్మెంట్ జోన్లు ఉండగా చార్మినార్ పరిధిలో అత్యధికంగా 30 ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ పరిధిలో 23 కంటైన్మెంట్ జోన్లు ఉండగా, ఖైరతాబాద్ జోన్‌లో 14, ఎల్బీ నగర్ జోన్‌లో 5, కూకట్‌పల్లి జోన్‌లో 7, శేరిలింగంపల్లి జోన్‌లో 10 ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యల్ఫ కంటైన్మెంట్ జోన్లు ఉన్న ప్రాంతం ఎల్బీనగర్ కావడం విశేషం.