తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభించేది ఎప్పుడంటే?

Saturday, December 19th, 2020, 03:00:07 AM IST


కరోనా కారణంగా రాష్ట్రంలో మార్చి 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఆలోచనతో ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి డిజిటల్, ఆన్లైన్ క్లాసులకు అనుమతులు ఇచ్చింది. అయితే దాదాపు పది నెలలుగా మూసి ఉన్న స్కూళ్లు, కాలేజీలను తిరిగి ఓపెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

సంక్రాంతి పండుగ తరువాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విషయం సీఎం కేసీఆర్ వద్దకు కూడా చేరీంట్టు తెలుస్తుంది. మరోవైపు విద్యా సంస్థలను ఓపెన్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే స్కూళ్ళు తెరిచినా తొమ్మిదో తరగతి పైబడిన విద్యార్దులకే తెరబోతున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్టూడెంట్లకు క్లాసులు, ఎగ్జామ్స్ పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.