ప్రశాంత్ నీల్ “సలార్” తర్వాత ఎన్టీఆర్ తోనే నా?

Sunday, December 13th, 2020, 02:20:04 PM IST

కేజీఎఫ్ తో సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, నెక్స్ట్ సలార్ అంటూ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేజీఎఫ్ 2 చాప్టర్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, అనంతరం. సలార్ ను చిత్రీకరించే ప్రయత్నం చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రేక్షకుల్లో అంచనాలు సృష్టించాయి. ప్రభాస్ ను ఒక మాఫియా డాన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం అనంతరం ప్రశాంత్ నెక్స్ట్ చిత్రం కూడా తెలుగు హీరో తోనే అంటూ టాక్ నడుస్తోంది.

అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ప్రశాంత్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ రౌద్రం రణం రుధిరం అనంతరం త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. అనంతరం 2022 లో ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా చేయనున్నారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. దీని పై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.