మూడో వికెట్ కోల్పోయిన భారత్…కోహ్లీ ఔట్!

Friday, March 26th, 2021, 04:13:35 PM IST

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా 32 ఓవర్లకు 158 పరుగులు సాధించి మూడు వికెట్ లను కోల్పోయింది. 32 వ ఓవర్ ఆఖరి బంతి కి టీమ్ ఇండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. 79 బంతుల్లో 66 పరుగులు చేసి ఔట్ గా వెను తిరిగాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చాడు కోహ్లీ. ప్రస్తుతం క్రేజు లో రాహుల్ కి పంత్ జత కలిశారు. అయితే మొదటి వన్డే లో సత్తా చాటిన భారత్, రెండవ వన్డే మ్యాచ్లో గెలుపొంది సీరీస్ ను దక్కించుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ అయిన గెలవాలని ఇంగ్లాండ్ కసి తో మ్యాచ్ ఆడుతోంది.