సీఎం పదవి నుంచి జగన్‌ని తప్పించండి.. సుప్రీం కోర్టులో పిటీషన్..!

Wednesday, October 14th, 2020, 06:55:37 PM IST

ఏపీ సీఎం జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేయడం సరికాదని సీఎం జగన్‌పై న్యాయవాదులు జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, మనీలాండరింగ్‌ కేసు కూడా నమోదైందని పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే న్యాయస్థానాలపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఇలాంటి తరుణంలో సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది.