అడవి శేష్ హిట్-2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్..!

Saturday, March 20th, 2021, 01:02:04 PM IST

విశ్వక్‌సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన “హిట్‌” చిత్రం మంచి ‌ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే హీరో నాని ఈ సినిమాకు నిర్మాతగ వ్యవహరించారు. అయితే హిట్‌ మూవీ మంచి విజయం సాధించిన తర్వాత దానికి సీక్వెల్‌ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

హిట్-2 మూవీలో విశ్వక్‌ సేన్‌కు బదులుగా అడవి శేష్‌ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు దీనికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో నాని చేతుల మీదుగా చితృ బృందం రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీలో అడవిశేష్ సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, కొత్త హీరోయిన్ కోమలి ప్రసాద్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభకానుందని, హిట్‌ 1 తెలంగాణ నేపథ్యంలో సాగగా.. హిట్‌-2 ఆంధ్రప్రదేశ్‌ నేపథ్యంలో సాగనుందని సమాచారం.