ఏపీ నూతన సీఎస్‌గా అదిత్యనాథ్‌దాస్ బాధ్యతల స్వీకరణ..!

Thursday, December 31st, 2020, 07:33:06 PM IST

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎస్ నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు స్వీకరించారు.

అయితే సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన అదిత్యనాథ్‌దాస్ తనకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ అజెండానే మా అజెండా అని తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, సీఎం పెట్టిన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. తనపై నమ్మకంతో ఈ బాద్యతలు అప్పగించిన సీఎం జగన్‌కు ఆదిత్యనాథ్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు.