కరోనా కట్టడికి ఆదిత్య మ్యూజిక్ భారీ విరాళం.. కేటీఆర్‌కి చెక్ అందచేత..!

Tuesday, April 7th, 2020, 12:20:23 AM IST

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వానికి తమవంతు సహాయంగా సినీ,రాజకీయ, క్రీడా, వ్యాపార సంస్థల అధినేతలు విరాళాలు అందిస్తున్నారు.

అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదిత్య మ్యూజిక్ తమ వంతు బాధ్యతగా 31 లక్షల ఆర్ధిక స‌హ‌కారం అందించింది. ఈ మేరకు ఆదిత్య మ్యూజిక్ అధినేతల్లో ఒకరైనా ఉమేశ్ గుప్తా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కి తమ సంస్థ తరుపున చెక్ అందించారు. అయితే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అని, ఈ లాక్‌డౌన్‌కి స‌హ‌క‌రిస్తూ ప్రజ‌లంతా సేఫ్ గా ఇళ్లకే పరిమితం అయి ప్రభుత్వాలకు సహకరించాలని అన్నారు.