రమేష్ ఆసుపత్రికి పంపడం అంటే టీడీపీ ఆఫీసుకి పంపినట్టే – ఏఏజి

Monday, May 17th, 2021, 10:41:29 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని, పదవుల్లో ఉన్న వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను రమేష్ ఆసుపత్రి కి పంపడం అంటే తెలుగు దేశం పార్టీ ఆఫీసు కు పంపినట్టే అంటూ ఏ ఏ జి పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది అతన్ని రమేష్ ఆసుపత్రి కి తరలించాలి అని హైకోర్ట్ ను కోరగా, న్యాయస్థానం తిరస్కరించినట్లు తెలిపారు. అయితే గతంలో రమేష్ ఆసుపత్రి పై క్రిమినల్ కేసులు ఉన్నాయి అని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం వలన 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని వెల్లడించారు సుధాకర్. అయితే తెలుగు దేశం పార్టీ కనుసన్నల్లో నడిచే రమేష్ ఆసుపత్రి యాజమాన్యం, వారు చెప్పిందే నివేదిక గా ఇచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.