మిల్క్ బ్యూటీ తమన్నా కి సోకిన కరోనా

Sunday, October 4th, 2020, 12:52:21 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మహమ్మారి భారిన పడి భారత్ లో రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. ప్రజా ప్రతినిదులు, సినిమా రంగానికి చెందినవారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా కరోనా వైరస్ భారిన పడినట్లు తెలుస్తోంది.

తమన్నా భాటియా కి హై ఫీవర్ ఉండటం తో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చేరారు. అయితే ఆ సమయం లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ కరోనా లక్షణాలు ఎంతగా ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదివరకే తమన్నా తల్లిదండ్రులు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్నారు. అయితే సినిమా షూటింగ్ ల నిమిత్త హైదరాబాద్ చేరుకున్న తమన్నా భాటియా కరోనా వైరస్ భారిన పడటం తో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.