నేనేం తప్పు చేయలేదు…అయినా ఎందుకు అరెస్ట్ చేశారు? – సంజనా గల్రాని

Saturday, September 12th, 2020, 01:44:41 AM IST


శాండల వుడ్ డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రాని ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే డోప్ టెస్ట్ చేయించుకొనేందుకు సంజనా గల్రాని నిరాకరించడం జరిగింది. టెస్టుల నిమిత్తం బెంగళూరు లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులతో, పోలీసులు తో నటి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నేనేం తప్పు చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ పోలీసులను అక్కడే నిలదీయడం జరిగింది. తనను బకరా చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. పోలీసుల పై నమ్మకం నశిస్తోంది అని తెలిపారు. అంతేకాక మీడియా ముందు రక్షిస్తాం అని చెప్పి, ఇప్పుడు రక్త పరీక్ష చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు అని, మిమ్మల్ని ఎలా నమ్మాలి, నేను తప్పు చేసినట్లు ఏం సాక్ష్యం లేకపోయినా, నన్ను బలిపశువు ను చేసి నన్ను ఇక్కడికి తీసుకు వచ్చారు అంటూ వాపోయింది. పరీక్షకు అంగీకరించడం, అంగీకరించక పోవడం నా హక్కు, నేను చేయించుకొను అంటూ పోలీసులతో గట్టిగా తేల్చి చెప్పేసింది.