హీరోయిన్ రకుల్ ప్రీత్ కి కరోనా పాజిటివ్

Tuesday, December 22nd, 2020, 03:17:36 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయం గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.తనకి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది అని, ఆరోగ్యం కూడా ప్రస్తుతం బాగానే ఉంది అని, త్వరలోనే కోలుకొని సినిమా షూటింగ్ లలో పాల్గొంటా అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అయితే తనను ఇటీవల కలిసిన వారు అంతా కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు. అయితే టాలీవుడ్ భామ కి కరోనా వైరస్ సోకడం తో సదరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రకుల్, టాలీవుడ్ లో మరొక సినిమాను ఒప్పుకున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు రకుల్. మరొక తెలుగు సినిమా తో పాటుగా, తమిళ్ లో కూడా నటిస్తోంది.