ఎంపీ, నటి నవనీత్ కి సోకిన కరోనా!

Friday, August 7th, 2020, 12:35:11 AM IST

ప్రపంచ దేశాలను భయ భ్రాంతులకి గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరికీ తమ ప్రతాపాన్ని చూపిస్తోంది. భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రజా ప్రతినిదులు సైతం ఈ మహమ్మారి భారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ సినీ నటి, ఎంపీ నవనీత్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నవనీత్. కుటుంబం లో 11 మంది కి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది.

అయితే మొదట తన ఇంట్లో మామ గంగాధర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలగా, మిగతా కుటుంబ సభ్యులు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు.అయితే తమ ఇంటిని ప్రస్తుతం శనిటైజ్ చేస్తున్న వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు నవనీత్. అయితే ఈ మహమ్మారి భారీ నుండి అందరినీ రక్షించాలి దేవుడు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నటి , ఎంపీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.