ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టిన ట్యాంకర్

Wednesday, November 18th, 2020, 12:07:42 PM IST

తమిళ ప్రముఖ నటి, బీజేపీ కీలక నేత ఖుష్బూ కారు ప్రమాదానికి గురి అయింది. అయితే ఈ ప్రమాదం నుండి నటి ఖుష్బూ క్షేమంగా బయట పడ్డారు. తను ప్రయాణిస్తున్న కారు మెల్వార్ వతూర్ సమీపం లో ఈరోజు ఉదయం ప్రమాదానికి గురైంది. అయితే కారును ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఒక పక్క డోర్ పూర్తిగా ధ్వంసం అయింది. అయితే సరైన సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకావడం తో కారులో ఉన్నవారు అంతా కూడా క్షేమం గా బయటపడ్డారు. అయితే కొందరితో కలిసి వేల్ యాత్రకి బయలు దేరిన కుష్బూ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం తో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారిన అనంతరం నుండి ఖుష్బూ పై పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.