జయా బచ్చన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కంగనా రనౌత్

Tuesday, September 15th, 2020, 11:16:09 PM IST


బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మృతి తో ఫిల్మ్ ఇండస్ట్రీ లో పలు అంశాలు తెరపైకి వచ్చాయి. డ్రగ్స్ కోణం ఇప్పుడు సర్వత్రా చర్చలకు దారి తీసింది. ఇదే వ్యవహారం పై పార్లమెంట్ లో కూడా నేడు చర్చ జరిగింది. అయితే బీజేపీ ఎంపీ రవి కిషన్ ఈ అంశం పై చర్చ లేవనెత్తారు. చిత్త పరిశ్రమ లో ఈ వ్యసనం ఉంది అని, నిందితుల పై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ను కోరారు. అయితే జయా బచ్చన్ దీని పై స్పందించారు. కొందరు వ్యక్తుల కారణం గా చిత్ర పరిశ్రమ ను కించపరచవద్దు అని, తిండిపెట్టే చెయ్యి ను నరుక్కోవద్దు అని అన్నారు. వీటి పై నటి కంగనా రనౌత్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

నా స్థానం లో మీ కుమార్తె శ్వేత ఉంటే, టీనేజ్ లో ఆమెను కొట్టి, డ్రగ్స్ ఇచ్చి, లైంగికంగా వేధించి ఉంటే ఇలా మాట్లాడే వారేనా అని సూటిగా ప్రశ్నించారు. అభిషేక్ బచ్చన్ కూడా వేధింపుల గురించి ఫిర్యాదులు చేసి, ఉరి వేసుకొని ఉంటే ఇలానే స్పందిస్తారా? మా మీద కొంచెం కరుణ చూపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుండి భారీగా మద్దతు లభిస్తోంది.