ఇంటి వివాదంలో ప్రముఖ నటి!

Monday, April 20th, 2015, 10:24:45 AM IST

Actress-Bhuvaneswari-house-
ప్రముఖ నటి భువనేశ్వరి మరోసారి వార్తలలోకి వచ్చారు. అయితే ఈసారి తన ఇంటిని అక్రమంగా ఒక వ్యాపారి లాక్కున్నారంటూ పోలీసులకు పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే కోవై జిల్లా అన్నూరులో తనకు ఉన్న ఇల్లు, ధియేటర్ ను 2012లో అన్నూరుకు చెందిన వ్యాపారవేత్త సుబ్రమణియన్ కు భువనేశ్వరి విక్రయించేందుకు నిర్ణయించారు. అయితే సుబ్రమణియన్ నకిలీ డాకుమెంట్స్ తయారు చేసి తన ఆస్తులను ఆక్రమించుకున్నారని భువనేశ్వరి ఆరోపించారు. ఈ నేపధ్యంగా సదరు వ్యాపారిపై చర్యలు తీసుకుని తన ఇల్లు, థియేటర్ లను తనకు అప్పగించాలని భువనేశ్వరి అన్నూరు పోలీసులకు పిర్యాదు చేశారు. ఇక భువనేశ్వరి పిర్యాదును అందుకున్న పోలీసులు సుబ్రమణియన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.