రాహుల్ గాంధీ పై నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు

Wednesday, October 28th, 2020, 06:00:08 PM IST

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ను వీడి, బీజేపీ లో చేరిన ప్రముఖ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తన లక్ష్మణ రేఖ దాటి బయటికి రావాలి అంటూ ఖుష్బూ హితబోధ చేశారు. అయితే రాహుల్ గాంధీ తన సమస్య కాదు అని, కాకపోతే తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తేల్చి చెప్పారు. అయితే పార్టీ ని వీడిన ఖుష్బూ తన బాటలోనే ఇంకొంత మంది కాంగ్రెస్ ను వీడిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని తెలిపారు.

అయితే ఆయన తన పరిసర ప్రాంతాన్ని దాటి బయటికి రావాలి అని, లక్ష్మణ రేఖ దాటి రావాలి అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీ మారిన ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ నేతల పై వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.