అల్లు అర్జున్ స్టైల్ స్టన్నింగ్ అంటున్న విజయ్ దేవరకొండ

Thursday, December 3rd, 2020, 05:04:27 PM IST

అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సెస్ తో అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. స్టైలిష్ స్టార్ అని పేరుకు తగ్గట్టుగా బన్నీ సినిమాలో మాత్రమే కాకుండా బయట కూడా అదే తరహాలో కనిపిస్తూ ఉంటాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశాడు. అయితే బన్నీ పిక్స్ అలా పోస్ట్ చేశాడో లేదో వెంటనే వైరల్ గా మారాయి. అయితే ఆ దుస్తుల్ని బన్నీకి అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ బహుమతి గా ఇచ్చాడు. అదే విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వెల్లడించారు. జాగర్ సెట్ ను పంపినందుకు విజయ్ దేవరకొండ కి అలాగే రౌడీ బ్రాండ్ కి కృతజ్ఞతలు అని తెలిపారు.

అయితే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి విజయ్ బదులు ఇచ్చారు. సూపర్ అన్నో అంటూ కామెంట్ చేశాడు. అల్లు అర్జున్ విజయ్ ల మధ్య ఇదివరకే ఇలాంటి సంభాషణ జరగగా, మరొకసారి సోషల్ మీడియా వేదికగా వీరి కామెంట్స్ వైరల్ గా మారడం మాత్రమే కాకుండా, బన్నీ లుక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు.