మణిరత్నం నవరసాల్లో సూర్య…దర్శకుడు ఎవరంటే?

Wednesday, November 18th, 2020, 10:44:03 AM IST

తమిళ అగ్ర దర్శకుడు మణిరత్నం నవరసాల నేపథ్యంలో వెబ్ సెరిస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోకి ఇప్పుడు సూర్య రానున్నారు. ఆ తొమ్మిది కథల్లో ఒక కథలో సూర్య నటించనున్నారు. ఈ నవరసాల్లో చిత్రీకరణ లో నటుడు సూర్య పాల్గొన్నారు. ఈ విషయాన్ని పిసి శ్రీరామ్ వెల్లడించారు. వెబ్ ఫిలిమ్ స్టార్ట్ చేశాం అని, సెట్స్ లో ఎనర్జీ రెండింతలు అందుకు కారణం సూర్య అంటూ పేర్కొన్నారు. అయితే సూర్య చేస్తున్న కథకి దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మిగతా ఎనిమిది కథల్లో కూడా ప్రముఖ నటులు కనిపించనున్నారు. అందుకు తగ్గట్లుగా దర్శకులు కూడా 9 మంది ఉన్న సంగతి తెలిసిందే.

అయితే సూర్య ఇటీవల ఆకాశం నీ హద్దు రా అంటూ చేసిన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. వరుస సినిమాలు చేస్తున్న సూర్య, ఈ వెబ్ ఫిలిమ్ లో నటించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న సమయం నుండి ఓటిటి లకు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే.