నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయండి – సోనూసూద్

Thursday, August 27th, 2020, 12:09:20 AM IST

Sonu-Sood
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశం లో రోజుకి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ నేపధ్యంలో లో నీట్, జే ఈ ఈ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దం అవుతుంది. అయితే ఈ మేరకు వీటి పై నటుడు సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భారత దేశం లో ఉన్న పరిస్థితుల రీత్యా నీట్ మరియు జే ఈ ఈ లని వాయిదా వేయాలని భారత ప్రభుత్వం ను కోరడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు.విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టకూడదు అని తెలిపారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఎక్కడినుం డో వస్తారు, పలు చోట్ల వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి అని, పలు చోట్ల ఇంకా లాక్ డౌన్ అమలు లో ఉంది అని సోనూసూద్ తెలిపారు. ప్రపంచం మొత్తం ఎక్కడిక్కడే నిలిచిపోయింది , పరీక్షలు వాయిదా వే యండి అని కోరారు.