చిరు సర్ చాలా ఇబ్బంది పడ్డారు – సోనూ సూద్

Sunday, December 20th, 2020, 10:00:44 PM IST

ప్రముఖ నటుడు సోనూ సూద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచార్య చిత్ర షూటింగ్ సమయం లో చిరు తనను కొట్టడానికి చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. లాక్ డౌన్ సమయం లో ఆపదలో ఆదుకున్న వాడిగా సోనూ సూద్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ ప్రతినాయక పాత్రలను పోషించారు నటుడు సోనూ సూద్. ఇక పై అటువంటి పాత్రలను చేయను అని తెలిపారు. ఆచార్య చిత్రీకరణ సమయం లో చిరు సర్ తనను కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు అని తెలిపారు.

తనకు హీరో పాత్రలతో అవకాశాలు వస్తున్నాయి అని, ఇప్పటికే నాలుగు అధ్బుతమైన స్క్రిప్ట్ లు తన వద్దకు వచ్చాయి అని అన్నారు. విలన్ పాత్రలు చేయను కాబట్టి, కొత్త ఆరంభానికి స్వాగతం పలుకుదాం అని సోనూ సూద్ చెప్పుకొచ్చారు. అయితే చిత్రీకరణ సమయం లో చిరు తనతో చెప్పిన విషయాలు సోనూ సూద్ వెల్లడించారు. ఎంతోమందికి సేవలు అందించి ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నావు, యాక్షన్ సీన్స్ లో నిన్ను కొట్టాలి అంటే నాకు ఇబ్బంది గా అనిపిస్తోంది ఒకవేళ నేను నిన్ను కొడితే ప్రజలు నాపై కోపంగా ఉంటారు అని తెలిపారు. ఈ విషయాలను ప్రస్తావించారు నటుడు సోనూ సూద్.