ప్రసాద్ ఐమాక్స్ లో హడావుడి చేసిన సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ మారుతి

Friday, December 4th, 2020, 01:43:49 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం అకూపెన్సీ తో తెరుచుకున్నాయి. అయితే థియేటర్ల ను ప్రేక్షకులు మాత్రమే కాకుండా, సినిమా రంగానికి చెందిన వారు కూడా చాలా మిస్ అవుతున్నారు. అయితే నేడు హాలీవుడ్ చిత్ర టెనెట్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి ప్రసాద్ ఐమాక్స్ లో చూసేందుకు వెళ్ళారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఎట్టకేలకు మేము సినిమా కి వచ్చాము, ఇది సురక్షితం, సరదాగా ఉంది అని, థియేటర్ల కి రావడం చూస్తుంటే మరల మా జీవితాల్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది అని, మీరు కూడా సినిమా ను థియేటర్ల లో చూసి ఆనందించండి అంటూ పేర్కొన్నారు.

మరో పక్క హీరో, నటుడు సాయి ధరమ్ తేజ్ ఒక వీడియో ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా తిరిగి థియేటర్ల కి రావాలని కోరుతూ ఆ వీడియో లో తెలిపారు. చాలా కాలం తర్వాత ధియేటర్ లోకి రావడం ఎంతో సంతోషం గా ఉంది అని, నా దృష్టి లో వెండితెర పై సినిమా చూడతం అధ్బుతమైన ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకొచ్చారు. నాలాగే చాలామందికి ఇదే ఫీలింగ్ ఉందని, సినిమాను మళ్లీ సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నారు. ధియేటర్ కి వచ్చే ముందు మాస్క్ లు దరించి, సానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి అని తెలిపారు.