“రాధేశ్యామ్” కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది

Tuesday, October 27th, 2020, 06:05:27 PM IST

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ తో ఈ చిత్రం సౌల్ ను చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు, ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కథ కి, ప్రభాస్ పాత్ర కి సంబంధించిన పలు కీలక విషయాలను నటుడు సచిన్ కెడ్కర్ వివరించారు.

ఈ చిత్ర కథ అనేది సైన్స్ కి మరియు జ్యోతిష్యానికి మద్య సాగుతుంది అని వివరించారు. ఈ చిత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని తెలిపారు. అయితే ఈ చిత్రంలో తను డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అయితే హీరో ప్రభాస్ భవిష్యత్ లో పూర్తి క్లారిటీ ఉండే పాత్రలో కనిపించనున్నారు అని సచిన్ పేర్కొన్నారు. ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం ను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ సాహో చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.