సీఎం జగన్ పై నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

Sunday, December 6th, 2020, 10:20:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ మంచి పనులు చేస్తున్నారు అని కొనియాడారు. అయితే తనకు రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదు అని, ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను అని మీడియా తో మాట్లాడారు. భారత దేశం లోనే ఏ రాష్ట్రం లో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ముఖ్యమంత్రి జగన్ హయాంలో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ది చెందుతుంది అని నారాయణ మూర్తి అన్నారు.

అయితే ఇప్పటి వరకు కూడా విశాఖ పట్టణం, తూర్పు గోదావరి సరిహద్దు లోని మెట్ట ప్రాంతాల్లో పంట పందటమే కష్టంగా ఉండేది అని, ఏలేరు, తాండవ రిజర్వాయర్లు ఉన్నా పరిస్తితుల్లో ఎటువంటి మార్పు రాలేదు అని నారాయణ మూర్తి గుర్తు చేశారు. అయితే సమస్యలను గుర్తించిన సీఎం జగన్ ఏలేరు నీటిని తాండవ కి అనుసంధానం చేసి భవిష్యత్ లో సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు అంటూ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి కార్యక్రమాలు చేపట్టే సీఎం జగన్ కి ఎల్లప్పుడూ తన సంపూర్ణ మద్దతు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే టీడీపీ, జన సేన మరియు బీజేపీ లో రాష్ట్రం లో అధికార వైసీపీ పాలన పై ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా, నటుడు ఆర్.నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.