నాగబాబు ఇచ్చిన కౌంటర్ కి ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?

Sunday, November 29th, 2020, 11:05:45 AM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపద్యం లో పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేన బరిలోకి దిగకుండా, బీజేపీ కి మద్దతు ఇవ్వడం పట్ల పలువురు ఘాటు విమర్శలు చేశారు. అయితే నటుడు ప్రకాశ్ రాజ్ సైతం స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ఊసరవెల్లి తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు నటుడు, పవన్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా ప్రతిస్పందించారు.

గౌరవనీయులైన నాగబాబు గారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్దం అయింది, నాకు దేశం మీద ఉన్న ప్రేమను అర్దం చేసుకోండి అని వ్యాఖ్యానించారు. నాకు తెలుగు భాష వచ్చు కానీ, మీ భాష రాదు అంటూ వ్యంగ్యంగా సెటైర్స్ వేశారు. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు, జన సైనికులు స్పందిస్తున్నారు. బీజేపీ పై మీరు చేసే వివిధ వేషాలు నిజమైన ఊసరవెల్లి ను తలపిస్తున్నాయి అని,మీరు సపోర్ట్ చేసిన కేసీఆర్ గతంలో ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు అనేది చూసుకొని మీ వ్యాఖ్యలను మీరే చదువుకోవాలి అని అన్నారు. మరి కొందరు మాత్రం ప్రకాష్ రాజ్ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.