విషాదం: ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు కరోనా తో మృతి!

Wednesday, September 23rd, 2020, 11:57:31 PM IST


కరోనా వైరస్ మహమ్మారి మరొక కళాకారుడ్ని బలి తీసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో గచ్చిబౌలి లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో గత 22 రోజుల నుండి కరోనా వైరస్ మహమ్మారి చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్తితి పూర్తిగా క్షీణించడంతో బుదవారం నాడు కన్ను మూశారు.

కోసూరి వేణుగోపాల్ ఎఫ్ సి ఐ లవ్ మెనేజేర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కి చెందిన ఈయన, ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. అయితే మర్యాద రామన్న, విక్రమార్కుడు ఛలో, పిల్ల జమిందార్ వంటి అనేక చిత్రాల్లో తన దైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. అయితే వేణుగోపాల్ మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది అంటూ కొందరు చెబుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి పోరు లో రికవరీ రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ కొందరు తీవ్ర అనారోగ్యం కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు.