సీఎం జగన్ కి ధన్యవాదాలు – కమల్ హాసన్

Tuesday, September 29th, 2020, 01:44:13 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కి ఒక లేఖ రాశారు. అందులో ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి భారత రత్న ఇవ్వాలి అంటూ లేఖ లో ప్రస్తావించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారత రత్న గురించి లేఖ రాయడం పట్ల ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అంటూ సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి విన్నవించడం ఎంతో గౌరవ ప్రదం అయినది అని,సరైనది అని, తమిళనాడు లో మాత్రమే కాదు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి దేశమంతా అభిమానులు ఉన్నారు అంటూ కమల్ హాసన్ అన్నారు. అయితే కమల్ హాసన్ ఎన్నో హిట్ చిత్రాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని వందల పాటలను పాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని దశాబ్దాల పాటు తనదైన శైలిలో పాటల పాడుతూ అశేష అభిమానుల్ని సంపాదించుకున్న గాన గంధర్వుడు. అయితే భారత రత్న ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.