ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎం గా జగన్ నిలుస్తారు – అలీ

Wednesday, September 16th, 2020, 10:15:05 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని నటుడు అలీ తాడేపల్లి లోని ముఖ్యమంత్రి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అయితే కరోనా వైరస్ సమయం లో సినిమా పరిశ్రమ గురించి సీఎం జగన్ వాకబు చేశారు అని అలీ మీడియా తో వెల్లడించారు. అయితే ఇంకా షూటింగ్ మొదలు కావడానికి సమయం పడుతుంది అని సీఎం జగన్ తో చెప్పిన విషయాన్ని అలి తెలిపారు.

ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అలీ పలు ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు అని అన్నారు.అంతేకాక సీఎం జగన్ ఎన్నికల లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నారు అని అన్నారు. అయితే సహజం గా సీఎం జగన్ మంచి చేస్తున్నప్పుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు అని, వారు చేయలేక పోయారు కాబట్టే, ఈయనకి మంచి పేరు వస్తుందని అక్కసుతో విమర్శలు చేస్తున్నారు అని అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, దేశంలో బెస్ట్ సీఎం గా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిలుస్తారు అని అలీ అన్నారు.