ఆ రామ్ ఎవరో నాకు తెలియదు – ఏసిపి సూర్యచంద్రరావు

Sunday, August 16th, 2020, 03:05:19 AM IST

హీరో రామ్ పొతినేని తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. స్వర్ణ పాలస్ వారి పై, రమేష ఆసుపత్రి వారి పై పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ కింద పని చేసే వారే జగన్ డ్యామేజ్ దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై ఏసిపి సూర్య చంద్ర రావు స్పందించారు.

ఆ రామ్ ఎవరో తనకు తెలియదు అని ఏసిపి అన్నారు. క్వారాంటైన్ సెంటర్,. కొవిడ్ సెంటర్ వేరు అని అన్నారు. క్వారంటైన్ సెంటర్ ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులను అబ్జర్వేషన్ లో ఉంచేలా, రోజుకి 2000 వేల రూపాయలు వసూలు చేస్తారు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే అక్కడ పేషంట్ లని విచారణ చేసినపపుదు రమేష హాస్పిటల్ వారు అడ్డంగా దోచుకున్నారు అని అన్నారు. అయితే మొదటి సారిగా హీరో రామ్ పోతినెని జగన్ అంశం గురించి ట్విట్టర్ ద్వారా ప్రస్తావించారు. అయితే రామ్ ఎవరో తెలియదు అని, క్వారంటైన్, కోవిద్ సెంటర్ లు వేరు వేరు అంటూ సూర్య చంద్ర రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.