22 మంది గొర్రెలను గెలిపించారు.. వైసీపీ ఎంపీలపై అచ్చెన్న కామెంట్స్..!

Tuesday, March 23rd, 2021, 05:04:28 PM IST

వైసీపీ ఎంపీలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు 2019 ఎన్నికల్లో 22 మంది గొర్రెలను ప్రజలు గెలిపించారని వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడడం లేదని అన్నారు. స్థానిక ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉందని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తామని అచ్చెన్న చెప్పుకొచ్చారు.

అయితే తిరుపతి ఉపఎన్నికలో టీడీపీనీ గెలిపిస్తేనే వైసీపీ పొగరు అనుగుతుందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల పేరిట వైసీపీ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి ప్రజల నుంచి 100 రూపాయలను దోచుకుంటుందని అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని కనీసం వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని అడగలేకపోతున్నారని అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో నిరంతరం టీడీపీ తరపున గెలిచిన మూడు పులులు మాత్రమే గళం విప్పుతున్నాయని ఆ ముగ్గురికి తోడుగా తిరుపతిలో గెలిపించి మరో పులిని చేర్చండని అచ్చెన్న కోరారు.