ఆచార్య టీజర్: ధర్మస్థలి డోర్లు తెరుచుకొనేది అప్పుడే!

Wednesday, January 27th, 2021, 11:07:13 AM IST

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడి గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సై రా నరసింహ రెడ్డి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత మెగాస్టార్ మరొక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయి చాలా రోజులే అవుతుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల తేదీ ను దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ధర్మస్థలి డోర్లు తెరుచుకొనేది జనవరి 29 సాయంత్రం 4:05 గంటలకు అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు. అయితే ఈ సందేశాన్ని చిరుకు చేర్చారు దర్శకుడు కొరటాల శివ.

అయితే నిన్న మెగాస్టార్ చిరంజీవి గారి కి, కొరటాల శివ గారికి మధ్య లో జరిగిన సంభాషణ ను చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీజర్ ను త్వరగా విడుదల చేయకపోతే తానే లీక్ చేస్తా అంటూ కొరటాల ను ఫన్నీ గా బెదిరించడం తో కొరటాల శివ నేడు తేదీ ను, టైమ్ ను ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం లో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం లో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.