ఆచార్య షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యేది అప్పటి నుండే?

Wednesday, November 4th, 2020, 02:53:57 PM IST

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయ్యేందుకు సిద్దంగా ఉంది. అయితే ఈ నెల 19 నుండి కరోనా వైరస్ జాగ్రత్త చర్యలు పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుండి అభిమానులు ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సై రా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం కావడం, కొరటాల శివ సైతం దీన్ని మరొక స్థాయిలో తెరకెక్కి స్టుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.