బ్రేకింగ్: నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..!

Monday, October 26th, 2020, 04:16:27 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునగడంతో వరద ముంపు ప్రాంతాలలో నారా లోకేశ్ పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతుల బాధలు అడిగి తెలుసుకున్న నారా లోకేశ్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.

అయితే ఈ పర్యటన సందర్భంగా ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నారా లోకేశ్ ట్రాక్టర్ నడిపారు. అయితే నారా లోకేశ్ ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి అది ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. అయితే పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. అయితే ఈ ఘటనలో లోకేశ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు.