రేవంత్ కుటుంబాన్ని విచారించిన ఏసీబీ!

Tuesday, June 9th, 2015, 11:08:59 AM IST


తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను మభ్యపెట్టిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మూడు రోజులుగా విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు నేటి ఉదయం హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. అలాగే ఈ కేసులో మరిన్ని వివరాల సేకరణ కోసం రేవంత్ కుటుంబ సభ్యులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అదేవిధంగా ఈ కేసులో ఇతర నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహాల ఇళ్ళల్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఏసీబీ కస్టడీలో ఉన్న రేవంత్ రెడ్డి విచారణ నేటితో ముగియనుంది.