మల్కాజిగిరి ఏసిపి ఇంట్లో ఐదు కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు

Thursday, September 24th, 2020, 02:08:29 AM IST


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తాజాగా మల్కాజ్ గిరి ఏసిపి అధికారులకి చిక్కారు. మల్కాజ్ గిరి ఏసిపి నర్సింహ రెడ్డి నివాసం లో ఇప్పటి వరకు ఐదు కోట్ల ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. అయితే హైదరాబాద్ లోని మహేంద్ర నివాసం లో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు ఈ మేరకు తెలియజేశారు. అయితే ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కాకుండా, వరంగల్, నల్గొండ, కరీం నగర్, అనంతపురం లో 25 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి అని వివరించారు.

అయితే ఇప్పటి వరకు ఐదు కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు, అంతేకాక బ్యాంక్ లాకర్ లలో చూడాలి అని,హైదరాబాద్ లో మూడు ఇండ్ల తో పాటుగా 5 ఇండ్ల స్థలాలు గుర్తించి నట్లు వివరించారు. అయితే నర్సింహ రెడ్డి బందువులు మరియు బినామీల ఇళ్లలోనూ సోదాలకి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది అని తెలిపారు. అయితే ముఖ్యంగా ప్రజా ప్రతినిదులతో లింక్ లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ లో బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.