ఈఎస్ఐ స్కాం లో ఇంకా విచారణ కొనసాగుతోంది – ఏసీబీ జేడీ రవి కుమార్

Friday, August 21st, 2020, 01:08:25 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సంచలనం సృష్టించిన ఈ ఎస్ ఐ కుంభకోణం విషయంలో ఇంకా విచారణ కొనసాగుతోంది అని ఏసీబీ జెడి రవి కుమార్ అన్నారు. ఈ విచారణ లో పూర్తి స్థాయిలో ఎవరి వాటా ఎంత అనేది త్వరలో తేలుస్తాం అని అన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కీలకం గా గుర్తించిననిందితులు అంతా కూడా ఒక రింగ్ లాగా ఏర్పడి అవినీతికి పాల్పడ్డారు అని మీడియా సమావేశం లో వెల్లడించారు. అంతేకాక డబ్బుల పంపకాలకి సంబంధించిన వాటాల పై నిందితుల నుండి వివరాలు రాబట్టనున్నాం అని అన్నారు.

అయితే ఈ కేసులో కీలకం గా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్న ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ఈ కేసులో అచ్చెన్న కి డబ్బు లు చేరలేదు అని ఏసీబీ చెప్పినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని స్పష్టం చేయడం తో ఎమ్మెల్యే అచ్చెన్న కి ఉచ్చు బిగిస్తోంది అని చెప్పాలి. అయితే ప్రభుత్వ ఖజానా కి నష్టం కలిగించే వారు ఎవరిని కూడా వదిలి పెట్టం అని తెలిపారు. అయితే ఈ కేసులో నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కేసు విషయం లో తప్పుడు వార్తలతో తప్పు దోవ పట్టించడం సరికాదు అని అన్నారు.